Logo

1సమూయేలు అధ్యాయము 17 వచనము 33

సంఖ్యాకాండము 13:31 అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారిమీదికి పోజాలమనిరి.

ద్వితియోపదేశాకాండము 9:2 ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా.

కీర్తనలు 11:1 యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?

ప్రకటన 13:4 ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.

1సమూయేలు 17:42 చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.

1సమూయేలు 17:56 అందుకు రాజు ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

1సమూయేలు 16:19 నున్నాడనగా సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొఱ్ఱలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను.

1సమూయేలు 17:31 దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను.

కీర్తనలు 71:5 నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.

దానియేలు 2:26 రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా

హెబ్రీయులకు 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;