Logo

1సమూయేలు అధ్యాయము 17 వచనము 52

1సమూయేలు 14:21 మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.

1సమూయేలు 14:22 అదియు గాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.

న్యాయాధిపతులు 7:23 నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.

2సమూయేలు 23:10 చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొనిపోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి.

యెహోషువ 15:33 మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా

యెహోషువ 15:34 జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

యెహోషువ 15:35 యర్మూతు అదు ల్లాము శోకో అజేకా

యెహోషువ 15:36 షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

యెహోషువ 15:45 ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,

యెహోషువ 15:46 దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,

నిర్గమకాండము 32:17 ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా

యెహోషువ 6:5 మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జను లందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.

యెహోషువ 15:36 షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

1సమూయేలు 19:5 అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా

1సమూయేలు 21:10 అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను.

1రాజులు 20:21 అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.

యోహాను 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.

హెబ్రీయులకు 11:34 అగ్ని బలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.