2సమూయేలు 13: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అట్లుండగా ఒకనాడు అతడు తన పనిమీద ఇంటి లోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.
అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమెచేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.
ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చినయెడల నాకేమి యిచ్చెదవని అడిగెను.
అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను
నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్క యైనను నీ తల్లి కుమార్తెయొక్క యైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.