2సమూయేలు 13: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె యెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్రపరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.
వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరి యుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.
అతడు ఆమాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వసాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.
ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.