లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 13: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 45:1

అప్పుడు యోసేపు తనయొద్ద నిలిచినవారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక నాయొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడుఎవరును అతనియెద్ద నిలిచియుండలేదు

న్యాయాధిపతులు 3:19

గిల్గాలు దగ్గర నున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చిరాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడుతనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను.

యోహాను 3:20

దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.