లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 3: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందు నిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 26:30

అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చు కొనిరి.

ఆదికాండము 31:54

యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.

ఎస్తేరు 1:3

తన యేలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్య దేశము యొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా

ఆదికాండము 21:8

ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

2సమూయేలు 3:13

అయితే నీవు ఒకపని చేయవలెను; దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నాయొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.

1దినవృత్తాంతములు 12:17

దావీదు బయలుదేరి వారికి ఎదురుగాపోయి వారితో ఇట్లనెను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నావలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగియుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.