లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 3: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటివారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 76:10

నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు.

మార్కు 6:18

ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను.

మార్కు 6:19

హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమెచేత గాకపోయెను.

2సమూయేలు 9:8

అతడు నమస్కరించి చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.

2సమూయేలు 16:9

సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.

ద్వితియోపదేశాకాండము 23:18

పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు.

1సమూయేలు 24:14

ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా?

1సమూయేలు 24:15

యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.

2రాజులు 8:13

అందుకు హజాయేలు కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటివాడను అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను.

2సమూయేలు 3:9

యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చనియెడల

2సమూయేలు 3:18

నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోనుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.

2సమూయేలు 5:2

పూర్వకాలమున సౌలు మామీద రాజైయుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి.

1సమూయేలు 15:28

అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీచేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.

కీర్తనలు 2:1

అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

కీర్తనలు 2:2

మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు

కీర్తనలు 2:3

భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

కీర్తనలు 2:4

ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు

యెషయా 37:23

నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా?

అపోస్తలులకార్యములు 9:4

అప్పుడతడు నేలమీద పడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

అపోస్తలులకార్యములు 9:5

ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును;

1సమూయేలు 17:43

ఫిలిష్తీయుడు కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.

1సమూయేలు 26:5

తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.

2సమూయేలు 2:8

నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొనిపోయి,

2సమూయేలు 3:24

యోవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి?