లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 43: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితివిు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 43:3

యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.

ఆదికాండము 43:7

వారు ఆ మనుష్యుడు మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మునుగూర్చియు మా బంధువులనుగూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు మీ సహోదరుని తీసికొనిరండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.

ఆదికాండము 42:3

యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.

ఆదికాండము 42:10

వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;

ఆదికాండము 42:27

అయితే వారు దిగినచోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను.

ఆదికాండము 42:35

వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.

ఆదికాండము 43:2

వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా

1రాజులు 3:17

వారిలో ఒకతె యిట్లు మనవి చేసెను నా యేలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితో కూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని.