లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 43: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు అతడు తన యెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 11:8

తరువాత దావీదు ఇంటికిపోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజనగరిలోనుండి బయలువెళ్లెను.

ఆదికాండము 45:22

అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

1సమూయేలు 1:5

హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.

1సమూయేలు 9:22

అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పదిమందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి

1సమూయేలు 9:23

పచనకర్తతో నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీచేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా

1సమూయేలు 9:24

పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను చూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడ భోజనము చేసెను,

సామెతలు 31:6

ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియ్యుడి.

ప్రసంగి 9:7

నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.

ప్రసంగి 10:19

నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము; ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.

హబక్కూకు 1:6

ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను.

మత్తయి 11:19

మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.

యోహాను 2:10

ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.

ఆదికాండము 33:4

అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.

1సమూయేలు 9:23

పచనకర్తతో నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీచేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా

ఎస్తేరు 1:10

ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు

కీర్తనలు 11:6

దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.

జెకర్యా 10:7

ఎఫ్రాయిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవానుబట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు.