లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 43: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడుమీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 42:38

అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను

ఆదికాండము 44:26

మేము అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండినయెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితివిు.

నిర్గమకాండము 20:12

నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

ఆదికాండము 42:20

మీ తమ్ముని నాయొద్దకు తీసికొనిరండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.

ఆదికాండము 43:3

యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.

ఆదికాండము 44:23

అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి.

ఆదికాండము 44:25

మా తండ్రిమీరు తిరిగివెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు