లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 43: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు ఆ మనుష్యుడు మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మునుగూర్చియు మా బంధువులనుగూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు మీ సహోదరుని తీసికొనిరండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 43:3

యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.

ఆదికాండము 43:3

యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.

ఆదికాండము 42:13

అందుకు వారు నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లెడు అని ఉత్తరమిచ్చిరి

ఆదికాండము 43:20

అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితివిు.

ఆదికాండము 44:19

ఏలినవాడు మీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.

ఆదికాండము 44:20

అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి