సంఖ్యాకాండము 1: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది.
గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,
ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు;
ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.
వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది.
లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
లేయా ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను.
గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.
బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది.