సంఖ్యాకాండము 1: 44
క్రాస్-రిఫరెన్స్‌లు
" వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.
ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.
మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.
మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;
షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు
యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను
ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు
జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు
ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు
గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.
వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.
మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు.