సంఖ్యాకాండము 1: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.
అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
దాను కుమారుడైన హుషీము.
దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.