సంఖ్యాకాండము 2: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనిమిదివేల నూరుమంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను.
దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబది యేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి
యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటిదగును గాక అనెను.
యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;