సంఖ్యాకాండము 2: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనిమిదివేల నూరుమంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను.
దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబది యేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.
యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటిదగును గాక అనెను.