సంఖ్యాకాండము 26: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు
ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.