Logo

2రాజులు అధ్యాయము 13 వచనము 9

2రాజులు 13:13 యెహోయాషు తన పితరులతో కూడ నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను.

2రాజులు 10:35 అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.

1రాజులు 14:13 అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.

2రాజులు 13:10 యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను.

2రాజులు 14:8 అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరము దర్శించునట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా

2రాజులు 14:16 అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.