Logo

2రాజులు అధ్యాయము 13 వచనము 12

2రాజులు 13:14 అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతనియొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.

2రాజులు 13:15 అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.

2రాజులు 13:16 నీ చెయ్యి వింటిమీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి

2రాజులు 13:17 తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులచేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి,

2రాజులు 13:18 బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.

2రాజులు 13:19 అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి నీవు అయిదు మారులైన ఆరు మారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.

2రాజులు 13:20 తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు

2రాజులు 13:21 కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లుమోపి నిలిచెను.

2రాజులు 13:22 యెహోయాహాజు దినములన్నియు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.

2రాజులు 13:23 గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టకయుండెను.

2రాజులు 13:24 సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 13:25 అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసికొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.

2రాజులు 14:15 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2రాజులు 14:25 గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రమువరకు ఇశ్రాయేలువారి సరిహద్దును మరల స్వాధీనము చేసికొనెను.

2రాజులు 14:8 అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరము దర్శించునట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా

2రాజులు 14:9 ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.

2రాజులు 14:10 నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతనుబట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను

2రాజులు 14:11 అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా

2రాజులు 14:12 యూదావారు ఇశ్రాయేలువారి యెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.

2రాజులు 14:13 మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదా రాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

2రాజులు 14:14 మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.

2రాజులు 14:15 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2రాజులు 14:16 అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.

2దినవృత్తాంతములు 25:17 అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచన చేసికొని రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను.

2దినవృత్తాంతములు 25:18 కాగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు తిరుగ వర్తమానము పంపెను నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న ముండ్లచెట్టు లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.

2దినవృత్తాంతములు 25:19 నేను ఎదోమీయులను ఓడించితిని గదా యని నీవనుకొనుచున్నావు; నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది; యింటియొద్ద నిలిచియుండుము; నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట యెందుకు? నీవును నీతోకూడ యూదావారును అపజయమొందుట యెందుకు?

2దినవృత్తాంతములు 25:20 జనులు ఎదోమీయుల దేవతలయొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువులచేతికి వారు అప్పగింపబడునట్లు దేవుని ప్రేరణవలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపకపోయెను.

2దినవృత్తాంతములు 25:21 ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి.

2దినవృత్తాంతములు 25:22 యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయెను.

2దినవృత్తాంతములు 25:23 అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసికొనివచ్చి, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మమువరకు నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

2దినవృత్తాంతములు 25:24 అతడు దేవుని మందిరములో ఓబేదెదోము నొద్దనున్న వెండియంతయు బంగారమంతయు ఉపకరణములన్నియు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు తిరిగివెళ్లెను.

2రాజులు 14:18 అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.