Logo

2రాజులు అధ్యాయము 13 వచనము 10

2రాజులు 14:1 ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.

2రాజులు 10:30 కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన యంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనముమీద ఆసీనులగుదురు.

2రాజులు 13:9 యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 14:17 యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.

2రాజులు 15:12 నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులైయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.