Logo

యోబు అధ్యాయము 30 వచనము 4

2రాజులు 4:38 ఎలీషా గిల్గాలునకు తిరిగిరాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను.

2రాజులు 4:39 అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొనివచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.

ఆమోసు 7:14 అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసుల కాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను.

లూకా 15:16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వానికేమియు ఇయ్యలేదు.

యోబు 15:23 అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగులాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.