Logo

యోబు అధ్యాయము 30 వచనము 11

యోబు 12:18 రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.

యోబు 12:21 అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.

2సమూయేలు 16:5 రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు

2సమూయేలు 16:6 జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.

2సమూయేలు 16:7 ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా

2సమూయేలు 16:8 ఛీ పో, ఛీ పో,నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడియున్నావని చెప్పి రాజును శపింపగా

కీర్తనలు 35:21 నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు.

మత్తయి 26:67 అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;

మత్తయి 26:68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి.

మత్తయి 27:39 ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు

మత్తయి 27:40 దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

మత్తయి 27:41 ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

మత్తయి 27:42 వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

మత్తయి 27:43 వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

మత్తయి 27:44 ఆయనతో కూడ సిలువ వేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

యాకోబు 1:26 ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.