Logo

యోబు అధ్యాయము 30 వచనము 9

యోబు 17:6 ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.

కీర్తనలు 35:15 నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.

కీర్తనలు 35:16 విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.

కీర్తనలు 44:14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

కీర్తనలు 69:12 గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

విలాపవాక్యములు 3:14 నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని.

విలాపవాక్యములు 3:63 వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని.

న్యాయాధిపతులు 16:23 ఫిలిష్తీయుల సర్దారులుమన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడు కొనిరి.

న్యాయాధిపతులు 16:25 వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారుమనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువ బెట్టి పరిహాసముచేయగా

2రాజులు 2:23 అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కివెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా

కీర్తనలు 22:7 నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.

కీర్తనలు 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.

విలాపవాక్యములు 3:46 మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు.

మత్తయి 26:67 అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;

లూకా 22:63 వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.