Logo

యోబు అధ్యాయము 33 వచనము 1

యోబు 13:6 దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.

యోబు 34:2 జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి

కీర్తనలు 49:1 సర్వజనులారా ఆలకించుడి.

కీర్తనలు 49:2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును

కీర్తనలు 49:3 నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.

మార్కు 4:9 వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

యోబు 6:24 నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి.

యోబు 13:17 నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి.

యోబు 15:17 నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచినదానిని నీకు వివరించెదను.

యోబు 18:2 మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచనచేసి ముగించినయెడల మేము మాటలాడెదము.

యోబు 21:2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

సామెతలు 8:6 నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

సామెతలు 23:31 ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.