Logo

యోబు అధ్యాయము 33 వచనము 11

యోబు 13:27 బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టు గిఱిగీసియున్నావు

కీర్తనలు 105:18 వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.

యిర్మియా 20:2 ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.

అపోస్తలులకార్యములు 16:24 అతడు అట్టి ఆజ్ఞను పొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.

యోబు 31:4 ఆయన నా ప్రవర్తన నెరుగును గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా

దానియేలు 4:35 భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు.

యోబు 14:16 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు

యోబు 31:35 నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.

రోమీయులకు 4:12 మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.