Logo

యోబు అధ్యాయము 33 వచనము 31

యోబు 13:6 దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.

యోబు 18:2 మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచనచేసి ముగించినయెడల మేము మాటలాడెదము.

యోబు 21:2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

యోబు 32:11 ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

ఆదికాండము 44:18 యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారు గదా

యోబు 6:24 నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి.

యోబు 21:3 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.

యోబు 29:22 నేను మాటలాడిన తరువాత వారు మారుమాట పలుకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.

యోబు 36:2 కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకను మాటలాడవలసియున్నది.

1కొరిందీయులకు 14:30 అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలుపరచబడినయెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.