Logo

యెషయా అధ్యాయము 6 వచనము 10

యెషయా 29:13 ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.

యెషయా 30:8 రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము

యెషయా 30:9 వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

యెషయా 30:10 దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి

యెషయా 30:11 అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

నిర్గమకాండము 32:7 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగివెళ్లుము; ఐగుప్తు దేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.

నిర్గమకాండము 32:8 నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.

నిర్గమకాండము 32:9 మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

నిర్గమకాండము 32:10 కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా

యిర్మియా 15:1 అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.

యిర్మియా 15:2 మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.

హోషేయ 1:9 యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీమ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

యెషయా 43:8 కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొనిరండి

యెషయా 44:18 వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను.

యెషయా 44:19 ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.

యెషయా 44:20 వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు.

మత్తయి 13:14 మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

మత్తయి 13:15 గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.

మార్కు 4:12 వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను

లూకా 8:10 ఆయన దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి యున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి.)

యోహాను 12:40 వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

అపోస్తలులకార్యములు 28:26 మీరు వినుటమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుటమట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము.

అపోస్తలులకార్యములు 28:27 ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.

రోమీయులకు 11:8 ఇందువిషయమై నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

నిర్గమకాండము 10:20 అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.

ద్వితియోపదేశాకాండము 28:28 వెఱ్ఱితనముచేతను గ్రుడ్డితనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.

ద్వితియోపదేశాకాండము 29:4 అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చియుండలేదు.

యెహోషువ 11:20 వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను.

1రాజులు 22:23 యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

2దినవృత్తాంతములు 18:19 ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.

యోబు 12:24 భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచును త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.

యోబు 33:14 దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు

కీర్తనలు 69:23 వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.

కీర్తనలు 119:144 నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

యెషయా 28:13 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

యెషయా 29:10 యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించియున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకువేసియున్నాడు.

యెషయా 29:14 కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.

యెషయా 42:19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

యెషయా 48:8 అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియును.

యిర్మియా 4:22 నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియునుగాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.

యిర్మియా 5:21 కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.

యిర్మియా 6:10 విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.

యిర్మియా 7:27 నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు

యిర్మియా 28:8 నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.

యెహెజ్కేలు 12:2 నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడకయున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.

జెకర్యా 11:17 మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.

మత్తయి 15:10 జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;

మార్కు 3:5 ఆయన వారి హృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

మార్కు 7:14 అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి మీరందరు నా మాట విని గ్రహించుడి.

మార్కు 8:18 మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా?

మార్కు 11:33 గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.

లూకా 19:42 నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.

లూకా 20:7 అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.

యోహాను 8:27 తండ్రినిగూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి.

యోహాను 8:43 మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననేగదా?

యోహాను 9:39 అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.

యోహాను 10:6 ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

యోహాను 12:39 ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా

యోహాను 12:41 యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.

2కొరిందీయులకు 7:9 మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.

2దెస్సలోనీకయులకు 2:11 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై,