Logo

యెషయా అధ్యాయము 7 వచనము 12

యెషయా 37:30 మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.

యెషయా 38:7 యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;

యెషయా 38:8 ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పదిమెట్లు మరల ఎక్కెను.

యెషయా 38:22 మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.

న్యాయాధిపతులు 6:36 అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించినయెడల

న్యాయాధిపతులు 6:37 నేను కళ్లమున గొఱ్ఱబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱ బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను.

న్యాయాధిపతులు 6:38 ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను.

న్యాయాధిపతులు 6:39 అప్పుడు గిద్యోనునీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చుచేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడి యుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా

న్యాయాధిపతులు 6:40 ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.

2రాజులు 20:8 యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను

2రాజులు 20:9 తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా?

2రాజులు 20:10 అందుకు హిజ్కియా యిట్లనెను నీడ పదిమెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును.

2రాజులు 20:11 ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలకమీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను.

యిర్మియా 19:1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యిర్మియా 19:10 ఈ మాటలు చెప్పిన తరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను

యిర్మియా 51:63 ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి

యిర్మియా 51:64 నేను దానిమీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.

మత్తయి 12:38 అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీవలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను.

మత్తయి 12:39 వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ యైనను వారికి అనుగ్రహింపబడదు.

మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.

మత్తయి 16:1 అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను

మత్తయి 16:2 సాయంకాలమున మీరు ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు,

మత్తయి 16:3 ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.

మత్తయి 16:4 వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనానుగూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారికనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.

ఆదికాండము 15:8 అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా

ఆదికాండము 24:14 కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.

నిర్గమకాండము 7:9 నీవు అహరోనును చూచి నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడవేయుమనుము; అది సర్పమగును.

న్యాయాధిపతులు 6:17 అందుకతడునాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము.

1సమూయేలు 14:10 మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవా వారిని మనచేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా

1రాజులు 13:3 ఈ బలిపీఠము బద్దలైపోయి దానిమీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను.

2రాజులు 19:29 మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.

సామెతలు 25:3 ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు.

యోహాను 6:30 వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?