Logo

యెషయా అధ్యాయము 42 వచనము 16

యెషయా 2:12 అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

యెషయా 2:13 ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

యెషయా 2:14 ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

యెషయా 2:15 ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

యెషయా 2:16 తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

యెషయా 11:15 మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నదిమీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.

యెషయా 11:16 కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును

యెషయా 44:27 నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను

యెషయా 49:11 నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

యెషయా 50:2 నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా? విడిపించుటకు నాకు శక్తిలేదా? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.

కీర్తనలు 18:7 అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.

కీర్తనలు 107:33 దేశనివాసుల చెడుతనమునుబట్టి

కీర్తనలు 107:34 ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.

కీర్తనలు 114:3 సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.

కీర్తనలు 114:4 కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులువేసెను.

కీర్తనలు 114:5 సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది?

కీర్తనలు 114:6 కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది?

కీర్తనలు 114:7 భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము

యిర్మియా 4:24 పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.

నహూము 1:4 ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును.

నహూము 1:5 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.

నహూము 1:6 ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని యెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.

హబక్కూకు 3:6 ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు.

హబక్కూకు 3:7 కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణకెను.

హబక్కూకు 3:8 యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు?

హబక్కూకు 3:9 విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా.) భూమిని బద్దలుచేసి నదులను కలుగజేయుచున్నావు.

హబక్కూకు 3:10 నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తనచేతులు పైకెత్తును.

హగ్గయి 2:6 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.

జెకర్యా 10:11 యెహోవా దుఃఖసముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.

ప్రకటన 6:12 ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

ప్రకటన 6:13 పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.

ప్రకటన 6:14 మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

ప్రకటన 6:15 భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

ప్రకటన 6:16 బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్నవాని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

ప్రకటన 6:17 మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.

ప్రకటన 8:7 మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి యంతయు కాలిపోయెను.

ప్రకటన 8:8 రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.

ప్రకటన 8:9 సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశనమాయెను.

ప్రకటన 8:10 మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటిబుగ్గల మీదను పడెను.

ప్రకటన 8:11 ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదైపోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.

ప్రకటన 8:12 నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.

ప్రకటన 11:13 ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.

ప్రకటన 16:12 ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండిపోయెను.

ప్రకటన 16:18 అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలుగలేదు, అది అంత గొప్పది

ప్రకటన 20:11 మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

యెషయా 24:1 ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.

యెషయా 40:4 ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను.

యెషయా 44:28 కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను.

యెషయా 51:10 అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసినవాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

యోహాను 12:46 నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.