Logo

యెషయా అధ్యాయము 45 వచనము 11

ద్వితియోపదేశాకాండము 27:16 తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

మలాకీ 1:6 కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.

హెబ్రీయులకు 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?

ప్రసంగి 6:10 ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను; ఆ యా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను; తమకంటె బలవంతుడైన వానితో వారు వ్యాజ్యెమాడజాలరు.

యెషయా 29:16 అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?

యిర్మియా 38:19 అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారిచేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహసించెదరు.