Logo

యెషయా అధ్యాయము 51 వచనము 1

యెషయా 28:15 మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.

యెషయా 28:16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది విశ్వసించువాడు కలవరపడడు.

యెషయా 28:17 నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

యెషయా 28:18 మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయబడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలువదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు

యెషయా 28:19 వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.

యెషయా 28:20 పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.

యెషయా 30:15 ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలివచ్చి ఊరకుండుటవలన రక్షింపబడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.

యెషయా 30:16 అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

యెషయా 55:2 ఆహారము కానిదానికొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి.

కీర్తనలు 20:7 కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములనుబట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.

కీర్తనలు 20:8 వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.

యిర్మియా 17:5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

యిర్మియా 17:6 వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

యిర్మియా 17:7 యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.

యోనా 2:8 అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.

మత్తయి 15:6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

మత్తయి 15:7 వేషధారులారా

మత్తయి 15:8 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

రోమీయులకు 1:21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

రోమీయులకు 1:22 వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

రోమీయులకు 10:3 ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.

నిర్గమకాండము 11:9 అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.

నిర్గమకాండము 11:10 మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.

యెహెజ్కేలు 20:39 ఇశ్రాయేలు యింటివారలారా, మీరు నామాట విననియెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను, మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడి, గాని మీ అర్పణలచేతను మీ విగ్రహములచేతను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ఆమోసు 4:4 బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి మూడేసి దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి.

ఆమోసు 4:5 పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్చార్పణనుగూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యోహాను 9:39 అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.

యెషయా 8:22 భూమి తట్టు తేరిచూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.

యెషయా 65:13 కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు

యెషయా 65:14 నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.

యెషయా 65:15 నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.

యెషయా 65:16 దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును.

కీర్తనలు 16:4 యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవులనెత్తను.

కీర్తనలు 32:10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.

మత్తయి 8:12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.

మత్తయి 22:13 అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.

యోహాను 8:24 కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను.

2దెస్సలోనీకయులకు 1:8 మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

2దెస్సలోనీకయులకు 1:9 ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరియందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

ప్రకటన 19:20 అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి

ప్రకటన 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

యోబు 18:5 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.

సామెతలు 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.

ప్రసంగి 2:1 కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్నమాయెను.

ప్రసంగి 5:7 అధికమైన స్వప్నములును మాటలును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము.

యెషయా 1:28 అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.

యెషయా 1:31 బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

యెషయా 2:5 యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

యెషయా 10:12 కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.

యిర్మియా 3:25 సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.

హబక్కూకు 2:13 జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యములకధిపతియగు యెహోవాచేతనే యగునుగదా.