Logo

యెషయా అధ్యాయము 56 వచనము 4

సంఖ్యాకాండము 18:4 వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.

సంఖ్యాకాండము 18:7 కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలిదాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.

ద్వితియోపదేశాకాండము 23:1 గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజములో చేరకూడదు.

ద్వితియోపదేశాకాండము 23:2 వానికి పదియవ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.

ద్వితియోపదేశాకాండము 23:3 అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.

జెకర్యా 8:20 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.

జెకర్యా 8:21 ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారియొద్దకు వచ్చిఆలస్యము చేయక యెహొవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు.

జెకర్యా 8:22 అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు.

జెకర్యా 8:23 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.

మత్తయి 8:10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 8:11 అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని

అపోస్తలులకార్యములు 8:27 అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటిమీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.

అపోస్తలులకార్యములు 10:1 ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతియైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.

అపోస్తలులకార్యములు 10:2 అతడు తన యింటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మముచేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.

అపోస్తలులకార్యములు 10:34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.

అపోస్తలులకార్యములు 13:47 ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.

అపోస్తలులకార్యములు 13:48 అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

అపోస్తలులకార్యములు 17:4 వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.

అపోస్తలులకార్యములు 18:7 అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను.

రోమీయులకు 2:10 సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.

రోమీయులకు 2:11 దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

రోమీయులకు 15:9 అందువిషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.

రోమీయులకు 15:10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు

రోమీయులకు 15:11 మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది.

రోమీయులకు 15:12 మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనులనేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.

రోమీయులకు 15:16 ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.

ఎఫెసీయులకు 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాననిబంధనలు లేని పరజనులును, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై యుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

ఎఫెసీయులకు 2:22 ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

1పేతురు 1:1 యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్‌ జ్ఞానమునుబట్టి,

యిర్మియా 50:5 ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.

జెఫన్యా 2:11 జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును.

1కొరిందీయులకు 6:17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

మత్తయి 15:26 అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా

మత్తయి 15:27 ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినునుగదా అని చెప్పెను.

లూకా 7:6 కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరాయన యొద్దకు వెళ్లి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.

లూకా 7:7 అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును,

లూకా 7:8 నేను సహా అధికారమునకు లోబడినవాడను; నాచేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను.

యెషయా 56:5 నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

యెషయా 39:7 మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.

యిర్మియా 38:7 రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు,

యిర్మియా 38:8 వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులోనుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను

యిర్మియా 38:9 రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమియు లేవు.

యిర్మియా 38:10 అందుకు రాజు నీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా

యిర్మియా 38:11 ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి,

యిర్మియా 38:12 అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొనిపోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటిని దింపి పాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.

యిర్మియా 38:13 యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

యిర్మియా 39:16 నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును.

యిర్మియా 39:17 ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

దానియేలు 1:3 రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

దానియేలు 1:4 తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

దానియేలు 1:5 మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానముచేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.

దానియేలు 1:6 యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి.

దానియేలు 1:7 నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.

దానియేలు 1:8 రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనగా

దానియేలు 1:9 దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను

దానియేలు 1:10 మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడనేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.

దానియేలు 1:11 నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను.

దానియేలు 1:12 భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.

దానియేలు 1:13 పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము.

దానియేలు 1:14 అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను.

దానియేలు 1:15 పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా

దానియేలు 1:16 రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యాదుల నిచ్చెను.

దానియేలు 1:17 ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.

దానియేలు 1:18 నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.

దానియేలు 1:19 రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి.

దానియేలు 1:20 రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్యగల వారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.

దానియేలు 1:21 ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను.

మత్తయి 19:12 తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.

మత్తయి 19:13 అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి.

మత్తయి 19:14 ఆయన శిష్యులు, తీసికొనివచ్చినవారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి

మత్తయి 19:15 వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.

మత్తయి 19:16 ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను.

మత్తయి 19:17 అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగ

మత్తయి 19:18 యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము,

మత్తయి 19:19 నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.

మత్తయి 19:20 అందుకు ఆ యౌవనుడు ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను.

మత్తయి 19:21 అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను

మత్తయి 19:22 అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను.

మత్తయి 19:23 యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మత్తయి 19:24 ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను.

మత్తయి 19:25 శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా

మత్తయి 19:26 యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.

మత్తయి 19:27 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా

మత్తయి 19:28 యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.

మత్తయి 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.

మత్తయి 19:30 మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.

అపోస్తలులకార్యములు 8:26 ప్రభువు దూత నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.

అపోస్తలులకార్యములు 8:27 అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటిమీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.

అపోస్తలులకార్యములు 8:28 అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.

అపోస్తలులకార్యములు 8:29 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను.

అపోస్తలులకార్యములు 8:30 ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా

అపోస్తలులకార్యములు 8:31 అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను.

అపోస్తలులకార్యములు 8:32 అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.

అపోస్తలులకార్యములు 8:33 ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.

అపోస్తలులకార్యములు 8:34 అప్పుడు నపుంసకుడు ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పునడిగెను.

అపోస్తలులకార్యములు 8:35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను.

అపోస్తలులకార్యములు 8:36 వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.

అపోస్తలులకార్యములు 8:37 ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.

అపోస్తలులకార్యములు 8:38 అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను.

అపోస్తలులకార్యములు 8:39 వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరియెన్నడును చూడలేదు.

అపోస్తలులకార్యములు 8:40 అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.

ఆదికాండము 37:36 మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.

ఆదికాండము 48:9 యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొని రమ్మనెను.

లేవీయకాండము 25:45 మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టినవారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.

సంఖ్యాకాండము 9:14 మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 23:3 అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.

రూతు 2:10 అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.

2సమూయేలు 22:45 అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు

1రాజులు 8:41 మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూర దేశమునుండి వచ్చి

2దినవృత్తాంతములు 6:32 మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, చాచిన చేతులనుగూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు

ఎస్తేరు 4:4 ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించుకొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు.

ఎస్తేరు 9:27 యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు,

ప్రసంగి 4:8 ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.

యెషయా 56:6 విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను

అపోస్తలులకార్యములు 10:35 ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.