Logo

యిర్మియా అధ్యాయము 2 వచనము 11

ఆదికాండము 10:4 యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.

ఆదికాండము 10:5 వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.

సంఖ్యాకాండము 24:24 కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.

1దినవృత్తాంతములు 1:7 యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదానీము.

1దినవృత్తాంతములు 23:1 దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.

1దినవృత్తాంతములు 23:12 కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

కీర్తనలు 120:5 అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.

యెహెజ్కేలు 27:6 బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలు చేయుదురు, కిత్తీయుల ద్వీపములనుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు.

దానియేలు 11:30 అంతట కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.

ఆదికాండము 25:13 ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము

యిర్మియా 18:13 కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసియున్నది.

యిర్మియా 18:14 లెబానోను పొలములోని బండమీద హిమముండుట మానునా? దూరమునుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా?

న్యాయాధిపతులు 19:30 అప్పుడు దాని చూచినవారందరు, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు ఈలాటిపని జరుగుటయైనను వినబడుటయైనను లేదు; మీరు ఇది మన స్సుకు తెచ్చుకొని దీనినిబట్టి ఆలోచనచేసి దీనినిగూర్చి మాటలాడుడని ఒకరితో నొకరు చెప్పుకొనిరి.

1కొరిందీయులకు 5:1 మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.

1రాజులు 9:9 జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.

1రాజులు 11:5 సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.

యెషయా 23:1 తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడిచేయబడెను.

యిర్మియా 49:28 బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెలవిచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచుకొనుడి.

యెహెజ్కేలు 5:7 కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.

దానియేలు 11:18 అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతని మీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.

ఆమోసు 3:9 అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి; ఎట్లనగా--మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.

ఆమోసు 6:2 కల్నేకు పోయి విచారించుడి; అక్కడనుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.

మీకా 4:5 సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.

మత్తయి 1:11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.