యెహెజ్కేలు 23:10 వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్షనొందెను.
యిర్మియా 3:2 చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.
యిర్మియా 2:7 దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.
యిర్మియా 2:27 వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములో లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.
యిర్మియా 10:8 జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.
యెషయా 57:6 నీ భాగ్యము లోయలోని రాళ్లలోనేయున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?
యెహెజ్కేలు 16:17 నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసికొని నీవు పురుషరూప విగ్రహములను చేసికొని వాటితో వ్యభిచరించితివి.
హోషేయ 4:12 నా జనులు తాము పెట్టుకొనిన కఱ్ఱయొద్ద విచారణ చేయుదురు, తమచేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.
హబక్కూకు 2:19 కఱ్ఱనుచూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ; అది ఏమైన బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూత పూయబడెను గాని దానిలో శ్వాసమెంతమాత్రమును లేదు.
నిర్గమకాండము 34:15 ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినయెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.
న్యాయాధిపతులు 8:33 గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక
2దినవృత్తాంతములు 21:13 ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతివారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు.
యిర్మియా 3:1 మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యిర్మియా 16:18 వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్రపరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమునుబట్టియు వారి పాపమునుబట్టియు రెండంతలుగా వారికి ప్రతికారము చేసెదను.
యెహెజ్కేలు 8:10 నేను లోపలికిపోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.
యెహెజ్కేలు 16:32 అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా?
యెహెజ్కేలు 20:18 వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.
యెహెజ్కేలు 36:17 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.
హోషేయ 1:2 మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి యున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.
హోషేయ 2:2 నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగా చేసి, పాడు పెట్టి యెండిపోయిన భూమివలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు,