Logo

యిర్మియా అధ్యాయము 7 వచనము 13

యెహోషువ 18:1 ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.

న్యాయాధిపతులు 18:31 దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.

1సమూయేలు 1:3 ఇతడు షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.

ద్వితియోపదేశాకాండము 12:5 మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.

ద్వితియోపదేశాకాండము 12:11 నేను మికాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొనిరావలెను.

యిర్మియా 26:6 మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.

1సమూయేలు 4:3 కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసికొని మన మధ్య నుంచుకొందము రండి; అది మన మధ్య నుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి.

1సమూయేలు 4:4 కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.

1సమూయేలు 4:10 ఫిలిష్తీయులు యుద్దము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.

1సమూయేలు 4:11 మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు హతులైరి.

1సమూయేలు 4:12 ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.

1సమూయేలు 4:13 అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.

1సమూయేలు 4:14 ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.

1సమూయేలు 4:15 ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.

1సమూయేలు 4:16 ఆ మనుష్యుడు యుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.

1సమూయేలు 4:17 అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను

1సమూయేలు 4:18 దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను; ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియై యుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను.

1సమూయేలు 4:19 ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను.

1సమూయేలు 4:20 ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై

1సమూయేలు 4:21 దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు1 అను పేరు పెట్టెను.

1సమూయేలు 4:22 దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.

1సమూయేలు 5:1 ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి

1సమూయేలు 5:2 దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.

1సమూయేలు 5:3 అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి.

1సమూయేలు 5:4 ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడప దగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను.

1సమూయేలు 5:5 కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుటలేదు.

1సమూయేలు 5:6 యెహోవా హస్తము అష్డోదు వారిమీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులలో నున్నవారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా

1సమూయేలు 5:7 అష్డోదు వారు సంభవించిన దాని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోను మీదను బహు భారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణము గదా; అది యిక మనమధ్య నుండకూడదని చెప్పుకొని

1సమూయేలు 5:8 ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొనిపోయిరి.

1సమూయేలు 5:9 అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.

1సమూయేలు 5:10 వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనయొద్దకు తీసికొని వచ్చిరనిరి.

1సమూయేలు 5:11 కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టియుండెను.

1సమూయేలు 5:12 చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.

1సమూయేలు 6:1 యెహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత

1సమూయేలు 6:2 ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా

1సమూయేలు 6:3 వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందురనిరి.

1సమూయేలు 6:4 ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.

1సమూయేలు 6:5 కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.

1సమూయేలు 6:6 ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.

1సమూయేలు 6:7 కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి

1సమూయేలు 6:8 యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.

1సమూయేలు 6:9 అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటినయెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసికొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందుమనిరి.

1సమూయేలు 6:10 వారు ఆలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి

1సమూయేలు 6:11 యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా

1సమూయేలు 6:12 ఆ ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.

1సమూయేలు 6:13 బేత్షెమెషువారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.

1సమూయేలు 6:14 ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.

1సమూయేలు 6:15 లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.

1సమూయేలు 6:16 ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగివెళ్లిరి

1సమూయేలు 6:17 అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.

1సమూయేలు 6:18 ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పంది కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో నున్నది.

1సమూయేలు 6:19 బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి.

1సమూయేలు 6:20 అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి

1సమూయేలు 6:21 కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపిఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొనివచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.

కీర్తనలు 78:60 షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.

కీర్తనలు 78:61 ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.

కీర్తనలు 78:62 తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను

కీర్తనలు 78:63 అగ్ని వారి యౌవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.

కీర్తనలు 78:64 వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

యెహోషువ 19:51 యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్లవలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.

న్యాయాధిపతులు 20:27 ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను.

న్యాయాధిపతులు 21:12 యాబేష్గి లాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశ మందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొనివచ్చిరి.

1సమూయేలు 6:21 కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపిఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొనివచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.

1రాజులు 2:27 తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండ తీసివేసెను, అందువలన యెహోవా ఏలీ కుటుంబికులనుగూర్చి షిలోహులో ప్రమాణముచేసిన మాట నెరవేరెను.

1రాజులు 8:16 నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను.

1రాజులు 14:4 యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరానివాడై యుండెను.

1దినవృత్తాంతములు 21:15 యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను.

కీర్తనలు 69:25 వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక

సామెతలు 21:27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.

యిర్మియా 41:5 గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొనిపోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెమునుండియు షిలోహునుండియు షోమ్రోనునుండియు రాగా

విలాపవాక్యములు 2:7 ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దానినగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్పగించెను వారు నియామకకాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.

యెహెజ్కేలు 10:18 యెహోవా మహిమ మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా