యిర్మియా 46:11 ఐగుప్తు కుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు
యిర్మియా 51:8 బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియలాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొనిరండి.
ఆదికాండము 37:25 వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.
ఆదికాండము 43:11 వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీరీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొనిపోవుడి.
మత్తయి 9:11 పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
మత్తయి 9:12 ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.
లూకా 5:31 అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు.
లూకా 5:32 మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
లూకా 8:43 ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.
యిర్మియా 30:12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;
యిర్మియా 30:13 నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.
యిర్మియా 30:14 నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్నుగూర్చి విచారింపరు.
యిర్మియా 30:15 నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.
యిర్మియా 30:16 నిన్ను మింగువారందరు మింగివేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడుసొమ్ముగా అప్పగించెదను.
యిర్మియా 30:17 వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.
యెషయా 1:5 నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
యెషయా 1:6 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
నిర్గమకాండము 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను
2దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
2దినవృత్తాంతములు 16:12 ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.
యోబు 13:4 మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.
కీర్తనలు 38:5 నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసనగలవై స్రవించుచున్నవి.
యిర్మియా 6:26 నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారునిగూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.
యిర్మియా 9:1 నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
యిర్మియా 14:19 నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.
యిర్మియా 30:13 నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.
విలాపవాక్యములు 2:13 యెరూషలేముకుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును? సీయోనుకుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు?
యెహెజ్కేలు 27:17 మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తకవ్యాపారము చేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
యెహెజ్కేలు 34:4 బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగము గలవాటిని స్వస్థపరచరు, గాయపడినవాటికి కట్టుకట్టరు, తోలివేసినవాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
యెహెజ్కేలు 47:12 నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.
హోషేయ 11:3 ఎఫ్రాయిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు
హోషేయ 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.
మార్కు 5:26 తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను.
లూకా 16:20 లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటివాకిట పడియుండి