Logo

యిర్మియా అధ్యాయము 16 వచనము 21

కీర్తనలు 115:4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు

కీర్తనలు 115:5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

కీర్తనలు 115:6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

కీర్తనలు 115:7 చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.

కీర్తనలు 115:8 వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

కీర్తనలు 135:14 యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపమునొందును.

కీర్తనలు 135:15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.

కీర్తనలు 135:16 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

కీర్తనలు 135:17 చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.

కీర్తనలు 135:18 వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.

యెషయా 36:19 అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నాచేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?

యెషయా 37:19 వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.

హోషేయ 8:4 నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.

హోషేయ 8:5 షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు?

హోషేయ 8:6 అది ఇశ్రాయేలువారిచేతిపనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.

అపోస్తలులకార్యములు 19:26 అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు

గలతీయులకు 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

గలతీయులకు 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులైయుంటిరి గాని

ఆదికాండము 35:2 యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరితోను మీయొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

యెషయా 44:9 విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.

యిర్మియా 2:11 దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.

దానియేలు 3:1 రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ యొకటి చేయించి, బబులోను దేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను. అది అరువది మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పునై యుండెను.

ఆమోసు 2:4 యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమ పితరులనుసరించిన అబద్ధములను చేపట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనకపోయిరి.