Logo

యిర్మియా అధ్యాయము 25 వచనము 25

1రాజులు 10:15 ఇదియు గాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్దనుండియు అరబి రాజుల యొద్దనుండియు దేశాధికారుల యొద్దనుండియు అతనికి చాలా వచ్చుచుండెను.

2దినవృత్తాంతములు 9:14 అరబీదేశపు రాజులందరును దేశాధిపతులును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొనివచ్చిరి.

యెషయా 21:13 అరేబియానుగూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.

యెహెజ్కేలు 27:21 అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.

యిర్మియా 25:20 సమస్తమైన మిశ్రిత జనులును ఊజు దేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును

యిర్మియా 49:28 బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెలవిచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచుకొనుడి.

యిర్మియా 49:29 వారి గుడారములను గొఱ్ఱల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు

యిర్మియా 49:30 హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచన చేయుచున్నాడు మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు యెహోవా వాక్కు ఇదే పారిపోవుడి బహులోతున వెళ్లుడి అగాధస్థలములలో దాగుడి

యిర్మియా 49:31 మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి.

యిర్మియా 49:32 వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు,

యిర్మియా 49:33 హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.

యిర్మియా 50:37 ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథములమీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.

ఆదికాండము 25:2 ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.

ఆదికాండము 25:3 యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.

ఆదికాండము 25:4 ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు.

ఆదికాండము 25:12 ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే.

ఆదికాండము 25:13 ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము

ఆదికాండము 25:14 మిష్మా దూమానమశ్శా

ఆదికాండము 25:15 హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా

ఆదికాండము 25:16 ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.

ఆదికాండము 37:25 వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.

ఆదికాండము 37:26 అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

ఆదికాండము 37:27 ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి గదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.

ఆదికాండము 37:28 మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

యెహెజ్కేలు 30:5 కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

యిర్మియా 49:30 హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచన చేయుచున్నాడు మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు యెహోవా వాక్కు ఇదే పారిపోవుడి బహులోతున వెళ్లుడి అగాధస్థలములలో దాగుడి

అపోస్తలులకార్యములు 2:11 క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.