Logo

యిర్మియా అధ్యాయము 30 వచనము 15

యిర్మియా 2:36 నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.

యిర్మియా 4:30 దోచుకొనబడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసికొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు.

యిర్మియా 22:20 నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము.

యిర్మియా 22:22 నీ కాపరులందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు.

యిర్మియా 38:22 యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.

విలాపవాక్యములు 1:2 రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.

విలాపవాక్యములు 1:19 నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి.

యెహెజ్కేలు 23:9 కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించియున్నాను.

యెహెజ్కేలు 23:22 కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.

హోషేయ 2:5 అది నాకు అన్నపానములను గొఱ్ఱబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది.

హోషేయ 2:10 దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నాచేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.

హోషేయ 2:11 దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును.

హోషేయ 2:12 ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్షచెట్లనుగూర్చియు అంజూరపు చెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలెచేతును.

హోషేయ 2:13 అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి యుండుటను బట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు.

హోషేయ 2:14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;

హోషేయ 2:15 అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు

హోషేయ 2:16 అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు.

ప్రకటన 17:12 నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక గడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారము పొందుదురు.

ప్రకటన 17:13 వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

ప్రకటన 17:14 వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధముచేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

ప్రకటన 17:15 మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.

ప్రకటన 17:16 నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.

ప్రకటన 17:17 దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.

ప్రకటన 17:18 మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే.

యోబు 13:24 నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

యోబు 13:25 ఇటు అటు కొట్టుకొనిపోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా?

యోబు 13:26 నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు

యోబు 13:27 బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టు గిఱిగీసియున్నావు

యోబు 13:28 మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

యోబు 16:9 ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

యోబు 19:11 ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.

యోబు 30:21 నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు

విలాపవాక్యములు 2:5 ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదాకుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.

హోషేయ 5:14 ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటివాడనుగాను యూదా వారికి కొదమసింహము వంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేకపోవును

యిర్మియా 30:15 నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.

యిర్మియా 5:6 వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.

కీర్తనలు 90:7 నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

కీర్తనలు 90:8 మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.

యెహెజ్కేలు 9:8 నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాస్టాంగపడి వేడుకొని అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా

యెహెజ్కేలు 9:9 ఆయన నాకీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలు వారి యొక్కయు యూదావారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది; వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని, దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపియున్నారు.

యెహెజ్కేలు 9:10 కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను.

ద్వితియోపదేశాకాండము 32:42 చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.

యోబు 6:15 నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.

యెషయా 23:16 మరవబడిన వేశ్యా, సితారా తీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము.

యెషయా 28:21 నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.

యెషయా 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.

యిర్మియా 6:23 వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారి చేయువారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.

యిర్మియా 14:17 నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవమువలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది; దివారాత్రము మానక నా కన్నులనుండి కన్నీరు కారుచున్నది.

విలాపవాక్యములు 1:5 దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి

విలాపవాక్యములు 2:4 శత్రువువలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధివలె కుడిచెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించియున్నాడు.

హోషేయ 5:13 తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.

ఓబధ్యా 1:7 నీతో సంధిచేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీకొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.