Logo

యిర్మియా అధ్యాయము 33 వచనము 23

యిర్మియా 31:37 యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసివేతును; యెహోవా వాక్కు ఇదే.

ఆదికాండము 13:16 మరియు నీ సంతానమును భూమిమీద నుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీద నుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.

ఆదికాండము 15:5 మరియు ఆయన వెలుపలికి అతని తీసికొనివచ్చి నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.

ఆదికాండము 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

ఆదికాండము 28:14 నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.

హోషేయ 1:10 ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.

హెబ్రీయులకు 11:12 అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింపశక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

ప్రకటన 7:9 అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలుచేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొఱ్ఱపిల్ల యెదుటను నిలువబడి

ప్రకటన 7:10 సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.

కీర్తనలు 22:30 ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవు తరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు.

కీర్తనలు 89:3 నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసియున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను

కీర్తనలు 89:4 తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసియున్నాను. (సెలా.)

కీర్తనలు 89:29 శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.

యెషయా 53:10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.

యెషయా 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.

యెషయా 53:12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనము చేసెను

యెహెజ్కేలు 37:24 నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.

యెహెజ్కేలు 37:25 మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.

యెహెజ్కేలు 37:26 నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను.

యెహెజ్కేలు 37:27 నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనైయుందును వారు నా జనులైయుందురు.

జెకర్యా 12:8 ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటి వారుగాను, దావీదు సంతతివారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

యెషయా 66:21 మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యెహెజ్కేలు 44:15 ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

ఆదికాండము 41:49 యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్య మాయెను గనుక కొలుచుట మానివేసెను.

సంఖ్యాకాండము 25:13 అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

1రాజులు 4:29 దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను

2దినవృత్తాంతములు 13:5 ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని1 నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.

యోబు 12:23 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

కీర్తనలు 72:16 దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.

కీర్తనలు 115:14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

యెషయా 48:19 నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు మరువబడదు

యిర్మియా 30:19 వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువమంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.

యిర్మియా 33:24 తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.

నహూము 3:16 నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగా నున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.

జెకర్యా 10:8 నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు.

ప్రకటన 20:8 భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.