Logo

యిర్మియా అధ్యాయము 35 వచనము 9

సామెతలు 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.

సామెతలు 1:9 అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును

సామెతలు 4:1 కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి

సామెతలు 4:2 నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.

సామెతలు 4:10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.

సామెతలు 6:20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.

సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.

కొలొస్సయులకు 3:20 పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.

2రాజులు 10:15 అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి నీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా అని అతనినడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. ఆలాగైతే నాచేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని

ఎస్తేరు 1:8 ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చి యుండెను.

యిర్మియా 35:2 నీవు రేకాబీయులయొద్దకు పోయి వారితో మాటలాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొనివచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవియ్యగా

యిర్మియా 35:10 గుడారములలోనే నివసించుచున్నాము.