Logo

యిర్మియా అధ్యాయము 40 వచనము 14

యిర్మియా 40:6 యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితో కూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.

యిర్మియా 40:7 అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.

యిర్మియా 40:8 కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయకాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.

2సమూయేలు 16:9 సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.

యిర్మియా 41:11 కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములనుగూర్చిన వార్త విని

యిర్మియా 42:1 అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవిచేసిరి

యిర్మియా 42:8 అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యదిఫతులనందరిని, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను

యిర్మియా 43:2 హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.

1కొరిందీయులకు 13:5 అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.