Logo

యిర్మియా అధ్యాయము 41 వచనము 7

యిర్మియా 50:4 ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదావారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు

2సమూయేలు 1:2 మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను.

2సమూయేలు 1:3 అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు నీవెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.

2సమూయేలు 1:4 జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడు జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.

2సమూయేలు 1:5 సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను

2సమూయేలు 1:6 గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను.

2సమూయేలు 1:7 అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా యేలినవాడా అని నేనంటిని.

2సమూయేలు 1:8 నీవెవడవని అతడు నన్నడుగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని.

2సమూయేలు 1:9 అతడు నా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధపడుచున్నాను ? నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా,

2సమూయేలు 1:10 ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.

2సమూయేలు 1:11 దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్దనున్న వారందరును ఆలాగున చేసి

2సమూయేలు 1:12 సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారినిగూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి.

2సమూయేలు 1:13 తరువాత దావీదు నీవెక్కడనుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని నడుగగా వాడు నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను.

2సమూయేలు 1:14 అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి?

2సమూయేలు 1:15 యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే;

2సమూయేలు 1:16 నీ నోటి మాటయే నీమీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.

2సమూయేలు 3:16 దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.

సామెతలు 26:23 చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.

సామెతలు 26:24 పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.

సామెతలు 26:25 వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు.

సామెతలు 26:26 వాడు తన ద్వేషమును కపట వేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.

2సమూయేలు 3:27 అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.

2సమూయేలు 13:24 అబ్షాలోము రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా