Logo

యిర్మియా అధ్యాయము 46 వచనము 4

యిర్మియా 51:11 బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.

యిర్మియా 51:12 బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటులను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానినిబట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు.

యెషయా 8:9 జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

యెషయా 8:10 ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.

యెషయా 21:5 వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను

యోవేలు 3:9 అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.

నహూము 2:1 లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము,

నహూము 3:14 ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగటమంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము.

యిర్మియా 46:14 ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.

యెహెజ్కేలు 38:7 నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను.