Logo

యెహెజ్కేలు అధ్యాయము 15 వచనము 3

ద్వితియోపదేశాకాండము 32:32 వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి.

ద్వితియోపదేశాకాండము 32:33 వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము.

కీర్తనలు 80:8 నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి

కీర్తనలు 80:9 దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపించెను

కీర్తనలు 80:10 దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను.

కీర్తనలు 80:11 దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను.

కీర్తనలు 80:12 త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?

కీర్తనలు 80:13 అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.

కీర్తనలు 80:14 సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.

కీర్తనలు 80:15 నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము.

కీర్తనలు 80:16 అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు.

పరమగీతము 2:13 అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము

పరమగీతము 2:15 మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.

పరమగీతము 6:11 లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని.

పరమగీతము 7:12 పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను

పరమగీతము 8:11 బయలు హామోను నందు సాలొమోనుకొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వేయి రూపాయిలు తేవలెను.

పరమగీతము 8:12 నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది సొలొమోనూ, ఆ వేయి రూపాయిలు నీకే చెల్లును. దానిని కాపు చేయువారికి రెండువందలు వచ్చును.

యెషయా 5:1 నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

యెషయా 5:2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను

యెషయా 5:3 కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

యెషయా 5:4 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?

యెషయా 5:5 ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

యెషయా 5:6 అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను.

యెషయా 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

యిర్మియా 2:21 శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టువంటి దానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతానమైతివి?

హోషేయ 10:1 ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్షచెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.

మత్తయి 21:33 మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.

మత్తయి 21:34 పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు ఆ కాపులయొద్దకు తన దాసులనంపగా

మత్తయి 21:35 ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరియొకనిమీద రాళ్లు రువ్విరి.

మత్తయి 21:36 మరల అతడు మునుపటికంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.

మత్తయి 21:37 తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారియొద్దకు పంపెను.

మత్తయి 21:38 అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని

మత్తయి 21:39 అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.

మత్తయి 21:40 కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను.

మత్తయి 21:41 అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి.

మార్కు 12:1 ఆయన ఉపమానరీతిగా వారికి బోధింప నారంభించెను; ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచెవేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను.

మార్కు 12:2 పంటకాలమందు ఆ కాపులనుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసుని పంపగా

మార్కు 12:3 వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.

మార్కు 12:4 మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి.

మార్కు 12:5 అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి.

మార్కు 12:6 ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారియొద్దకు అతనిని పంపెను.

మార్కు 12:7 అయితే ఆ కాపులు ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని

మార్కు 12:8 అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి.

మార్కు 12:9 కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు

లూకా 20:9 అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాలముండెను.

లూకా 20:10 పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.

లూకా 20:11 మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.

లూకా 20:12 మరలనతడు మూడవవాని పంపగా వారు వానిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి.

లూకా 20:13 అప్పుడా ద్రాక్షతోట యజమానుడు నేనేమిచేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను.

లూకా 20:14 అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితోనొకరు ఆలోచించుకొని

లూకా 20:15 అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?

లూకా 20:16 అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాకనిరి.

యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.

యోహాను 15:2 నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.

యోహాను 15:3 నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు.

యోహాను 15:4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.

యోహాను 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

యోహాను 15:6 ఎవడైనను నాయందు నిలిచియుండనియెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.

యెషయా 44:23 యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును

మీకా 3:12 కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

జెకర్యా 11:2 దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.

యెషయా 27:11 దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.

యిర్మియా 24:2 ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యము కానంతగా జబ్బువి.

యెహెజ్కేలు 2:1 నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అని

యెహెజ్కేలు 15:6 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను అగ్నికప్పగించిన ద్రాక్షచెట్టు అడవిచెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్థులును ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను.

యెహెజ్కేలు 19:10 మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫలభరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లివలె నుండెను.

హోషేయ 11:6 వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును.

మత్తయి 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.

మత్తయి 7:19 మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.

మత్తయి 25:30 మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.

లూకా 3:9 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.

లూకా 23:31 వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.

యోహాను 15:4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.

హెబ్రీయులకు 6:8 అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.