Logo

యెహెజ్కేలు అధ్యాయము 17 వచనము 14

యెహెజ్కేలు 17:5 మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.

2రాజులు 24:17 మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.

యిర్మియా 37:1 బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను.

2దినవృత్తాంతములు 36:13 మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.

యిర్మియా 5:2 యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.

2రాజులు 24:15 అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.

2రాజులు 24:16 ఏడు వేలమంది పరాక్రమశాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.

యిర్మియా 24:1 బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమునుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొనిపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.

యిర్మియా 29:2 యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచివెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,

ఆదికాండము 21:27 అబ్రాహాము గొఱ్ఱలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.

యెహోషువ 6:22 అయితే యెహోషువఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా

1సమూయేలు 11:1 అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరు మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి

1సమూయేలు 30:15 ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వాని నడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.

1రాజులు 15:19 నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగియుండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను.

2రాజులు 17:4 అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.

ఎజ్రా 4:19 అందువిషయమై మా యాజ్ఞనుబట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.

ప్రసంగి 8:2 నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను.

యిర్మియా 32:4 అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;

యిర్మియా 41:1 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పదిమంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనము చేసిరి.

యెహెజ్కేలు 12:10 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును

యెహెజ్కేలు 16:59 ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను.

యెహెజ్కేలు 21:23 ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.

దానియేలు 11:23 అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనము గలవాడైనను ఎదురాడి బలము పొందును.

హోషేయ 10:4 అబద్ధ ప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి.

జెకర్యా 5:3 అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమియంతటి మీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.