Logo

యెహెజ్కేలు అధ్యాయము 24 వచనము 10

యెహెజ్కేలు 24:6 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగల కుండా, మానకుండ మడ్డిగలిగియుండు కుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొనిరమ్ము.

నహూము 3:1 నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.

హబక్కూకు 2:12 నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.

లూకా 13:34 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కలక్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి.

లూకా 13:35 ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.

ప్రకటన 14:20 ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

ప్రకటన 16:6 దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.

ప్రకటన 16:19 ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.

యెహెజ్కేలు 22:19 కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టువంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు

యెహెజ్కేలు 22:20 నా కోపముచేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.

యెహెజ్కేలు 22:21 మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు.

యెహెజ్కేలు 22:22 కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 22:31 కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెషయా 30:33 పూర్వమునుండి తోపెతు1 సిద్ధపరచబడియున్నది అది మొలెకు దేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.

యెషయా 31:9 వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి.

2దెస్సలోనీకయులకు 1:8 మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

2పేతురు 3:7 అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

2పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

2పేతురు 3:9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీయెడల ధీర్ఘశాంతము గలవాడైయున్నాడు.

2పేతురు 3:10 అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును

2పేతురు 3:11 ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు,

2పేతురు 3:12 దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను.

యూదా 1:7 ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.

ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

యెహెజ్కేలు 10:2 అప్పుడు అవిసెనారబట్ట ధరించుకొనినవానితో యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికిపోయెను.

యెహెజ్కేలు 22:2 నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.

యెహెజ్కేలు 24:5 మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడికించుము.