Logo

యెహెజ్కేలు అధ్యాయము 26 వచనము 4

యెహెజ్కేలు 26:3 ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.

యెహెజ్కేలు 26:4 వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.

యెహెజ్కేలు 26:5 సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనేమాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.

యెహెజ్కేలు 26:6 బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

యెషయా 23:15 ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా

యెషయా 23:16 మరవబడిన వేశ్యా, సితారా తీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము.

యెషయా 23:17 డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.

కీర్తనలు 45:12 తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

కీర్తనలు 72:10 తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబ రాజులును సెబా రాజులును కానుకలు తీసికొనివచ్చెదరు.

యెషయా 23:18 వేశ్య జీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.

జెకర్యా 9:1 హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి

జెకర్యా 9:2 ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొనియున్న హమాతునుగూర్చియు, జ్ఞానసమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.

జెకర్యా 9:3 తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.

జెకర్యా 9:4 యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతికప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.

జెకర్యా 9:5 అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.

జెకర్యా 9:6 అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను.

జెకర్యా 9:7 వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదావారిలో పెద్దలవలె నుందురు, ఎక్రోనువారును యెబూసీయులవలె నుందురు.

యెహెజ్కేలు 5:8 కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.

యెహెజ్కేలు 21:3 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను.

యెహెజ్కేలు 28:22 సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనతనొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానినిబట్టి నన్ను పరిశుద్ధ పరచుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

యెహెజ్కేలు 38:3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.

యిర్మియా 21:13 యెహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువారలారా,

యిర్మియా 50:31 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినైయున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది

నహూము 2:12 తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడిపట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?

మీకా 4:11 మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడి వచ్చియున్నారు.

జెకర్యా 14:2 ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

యెహెజ్కేలు 27:26 నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.

యెహెజ్కేలు 27:32 వారు నిన్నుగూర్చి ప్రలాపవచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?

యెహెజ్కేలు 27:33 సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి.

యెహెజ్కేలు 27:34 ఇప్పుడు అగాధజలములలో మునిగి సముద్రబలముచేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్సమూహమును నీతోకూడ కూలెనేయని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.

కీర్తనలు 93:3 వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి

కీర్తనలు 93:4 విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు

కీర్తనలు 107:25 ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను

యెషయా 5:30 వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జన చేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటియగును.

యిర్మియా 6:23 వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారి చేయువారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.

యిర్మియా 51:42 సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను.

లూకా 21:25 మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.

2దినవృత్తాంతములు 28:9 యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెను ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీచేతికి అప్పగించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.

యెషయా 23:4 సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదన పడనిదానను పిల్లలు కననిదానను యౌవనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.

యిర్మియా 48:27 ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి

యిర్మియా 50:11 నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే?

యిర్మియా 51:55 యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించుచున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది.

విలాపవాక్యములు 2:13 యెరూషలేముకుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును? సీయోనుకుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు?

యెహెజ్కేలు 13:8 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 26:7 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి

యెహెజ్కేలు 26:19 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగిపోవువారితో కూడ నిన్ను నివసింపజేసెదను.

నహూము 2:13 నేను నీకు విరోధినై యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమసింహములను మింగివేయును, నీకిక దొరకకుండ భూమిలోనుండి నీవు పట్టుకొనిన యెరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.