Logo

యెహెజ్కేలు అధ్యాయము 36 వచనము 4

యెహెజ్కేలు 13:10 సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

లేవీయకాండము 26:43 వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు.

యిర్మియా 39:1 యూదా రాజైన సిద్కియా యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చి దాని ముట్టడివేయగా

యిర్మియా 39:2 సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.

యిర్మియా 39:3 యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండులకధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.

యిర్మియా 39:4 యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.

యిర్మియా 39:5 అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి

యిర్మియా 39:6 బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరిని చంపించెను.

యిర్మియా 39:7 అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.

యిర్మియా 39:8 కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.

యిర్మియా 39:9 అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.

యిర్మియా 39:10 అయితే రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.

యిర్మియా 39:11 మరియు యిర్మీయానుగూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు

యిర్మియా 39:12 ఈ ఆజ్ఞ ఇచ్చెను నీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను.

యిర్మియా 39:13 కావున రాజదేహసంరక్షకులకు అధిపతియైన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నేర్గల్‌షరేజరును బబులోనురాజు ప్రధానులందరును దూతలను పంపి

యిర్మియా 39:14 బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను.

యిర్మియా 39:15 యిర్మీయా బందీగృహశాలలోనుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యిర్మియా 39:16 నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును.

యిర్మియా 39:17 ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 39:18 నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 41:1 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పదిమంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనము చేసిరి.

యిర్మియా 41:2 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోను రాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి.

యిర్మియా 41:3 మరియు మిస్పాలో గెదల్యాయొద్ద ఉండిన యూదులనందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.

యిర్మియా 41:4 అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడక మునుపు

యిర్మియా 41:5 గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొనిపోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెమునుండియు షిలోహునుండియు షోమ్రోనునుండియు రాగా

యిర్మియా 41:6 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలువెళ్లి వారిని కలిసికొని వారితో-- అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు రండనెను.

యిర్మియా 41:7 అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి.

యిర్మియా 41:8 అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను.

యిర్మియా 41:9 ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.

యిర్మియా 41:10 అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా

యిర్మియా 41:11 కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములనుగూర్చిన వార్త విని

యిర్మియా 41:12 పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి.

యిర్మియా 41:13 ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో కూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి

యిర్మియా 41:14 ఇష్మాయేలు మిస్పాలోనుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యెహానానుతో కలిసిరి.

యిర్మియా 41:15 అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయులయొద్దకు పారిపోయిరి.

యిర్మియా 41:16 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత,

యిర్మియా 41:17 కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పాదగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;

యిర్మియా 41:18 అయితే వారు బబులోను రాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.

యిర్మియా 52:1 సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.

యిర్మియా 52:2 యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను.

యిర్మియా 52:3 యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజుమీద తిరుగుబాటుచేయగా

యిర్మియా 52:4 అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.

యిర్మియా 52:5 ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.

యిర్మియా 52:6 నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.

యిర్మియా 52:7 పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలువెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొనియుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.

యిర్మియా 52:8 కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.

యిర్మియా 52:9 వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను.

యిర్మియా 52:10 బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి

యిర్మియా 52:11 రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతని పెట్టించెను.

యిర్మియా 52:12 అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.

యిర్మియా 52:13 అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చివేసెను.

యిర్మియా 52:14 మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి

యిర్మియా 52:15 మరియు రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొనిపోయెను.

యిర్మియా 52:16 అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను.

యిర్మియా 52:17 మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి.

యిర్మియా 52:18 అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.

యిర్మియా 52:19 మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.

యిర్మియా 52:20 రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.

యిర్మియా 52:21 వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.

యిర్మియా 52:22 దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయిదేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.

యిర్మియా 52:23 ప్రక్కలయందు తొంబదియారు దానిమ్మ పండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మ పండ్లన్నియు నూరు.

యిర్మియా 52:24 మరియు రాజదేహసంరక్షకుల యధిపతి ప్రధాన యాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.

యిర్మియా 52:25 అతడు పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన యొక ఉద్యోగస్ధుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగు వానియొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.

యిర్మియా 52:26 రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజునొద్దకు తీసికొని వచ్చెను.

యిర్మియా 52:27 బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదావారిని తమ దేశములోనుండి చెరగొనిపోయెను.

యిర్మియా 52:28 నెబుకద్రెజరు తన యేలుబడియందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను

యిర్మియా 52:29 నెబుకద్రెజరు ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు యెరూషలేమునుండి ఎనిమిదివందల ముప్పది యిద్దరిని చెరగొనిపోయెను.

యిర్మియా 52:30 నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజ దేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మనుష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.

యిర్మియా 52:31 యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువదియైదవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడియందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి

యిర్మియా 52:32 అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.

యిర్మియా 52:33 మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించికొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను.

యిర్మియా 52:34 మరియు అతడు చనిపోవువరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోను రాజుచేత భోజనపదార్థములు ఇయ్యబడుచుండెను.

విలాపవాక్యములు 1:1 జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?

విలాపవాక్యములు 5:22 నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.

కీర్తనలు 35:25 ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక

కీర్తనలు 61:1 దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము

సామెతలు 1:12 పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.

యిర్మియా 51:34 బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచియున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు.

విలాపవాక్యములు 2:2 ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాసస్థలములన్నిటిని నాశనము చేసియున్నాడు మహోగ్రుడై యూదాకుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు.

విలాపవాక్యములు 2:5 ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదాకుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.

విలాపవాక్యములు 2:16 నీ శత్రువులందరు నిన్నుచూచి నోరుతెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లుకొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.

ద్వితియోపదేశాకాండము 28:37 యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువైయుందువు.

1రాజులు 9:7 నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.

1రాజులు 9:8 ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసెనని యడుగగా

కీర్తనలు 44:13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టు నున్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

కీర్తనలు 44:14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

కీర్తనలు 79:10 వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమునుగూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము.

యిర్మియా 18:16 వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.

యిర్మియా 24:9 మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.

యిర్మియా 33:24 తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.

విలాపవాక్యములు 2:15 త్రోవను వెళ్లువారందరు నిన్నుచూచి చప్పట్లుకొట్టెదరు వారు యెరూషలేముకుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమునుగూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు

దానియేలు 9:16 ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, యెరూషలేము నీ జనులచుట్టు నున్న సకల ప్రజల యెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.

యోబు 30:1 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.

యోబు 30:2 వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది.

యోబు 30:3 దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్యముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు

యోబు 30:4 వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడు వేళ్లు వారికి ఆహారమైయున్నవి.

యోబు 30:5 వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను

యోబు 30:6 నేల సందులలోను బండల సందులలోను వారు కాపురముండవలసి వచ్చెను.

యోబు 30:7 తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.

యోబు 30:8 వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.

యోబు 30:9 అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.

యోబు 30:10 వారు నన్ను అసహ్యించుకొందురు నాయొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు

కీర్తనలు 35:15 నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.

కీర్తనలు 35:16 విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.

కీర్తనలు 69:12 గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

మత్తయి 27:39 ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు

మత్తయి 27:40 దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

మత్తయి 27:41 ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

మత్తయి 27:42 వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

మత్తయి 27:43 వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

మత్తయి 27:44 ఆయనతో కూడ సిలువ వేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

1కొరిందీయులకు 4:13 దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.

కీర్తనలు 79:4 మా పొరుగువారికి మేము అసహ్యులమైతివిు మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు.

యెషయా 49:19 నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.

యిర్మియా 30:17 వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

విలాపవాక్యములు 3:62 నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు.

యెహెజ్కేలు 12:19 దేశములోని జనులకీలాగు ప్రకటించుము యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలోనున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు

యెహెజ్కేలు 23:32 అందులో పానము చేయవలసినది చాలయున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.

యెహెజ్కేలు 34:29 మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోటయొకటి నే నేర్పరచెదను.

యెహెజ్కేలు 36:5 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరినిబట్టియు, శేషించిన అన్యజనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.

హోషేయ 8:8 ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటి వారై అన్యజనులలో నుందురు.

మలాకీ 1:3 ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని.