Logo

యెహెజ్కేలు అధ్యాయము 40 వచనము 46

యెహెజ్కేలు 8:5 నరపుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.

లేవీయకాండము 8:35 మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.

సంఖ్యాకాండము 3:27 కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.

సంఖ్యాకాండము 3:28 ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరి లెక్కచూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధస్థలమును కాపాడవలసినవారైరి.

సంఖ్యాకాండము 3:32 యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడువారిమీద విచారణకర్త.

సంఖ్యాకాండము 3:38 మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.

సంఖ్యాకాండము 18:5 అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.

1దినవృత్తాంతములు 6:49 అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను.

1దినవృత్తాంతములు 9:23 వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరముయొక్క గుమ్మములకు వంతులచొప్పున కావలికాయు పని గలిగియుండెను.

2దినవృత్తాంతములు 13:11 వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.

కీర్తనలు 134:1 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.

మలాకీ 2:4 అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మలాకీ 2:5 నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై

మలాకీ 2:6 సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.

మలాకీ 2:7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను.

1తిమోతి 6:20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము.

ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

యెహెజ్కేలు 40:46 ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు.

2రాజులు 11:2 రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును, హతమైన రాజకుమారులతో కూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెను.

2దినవృత్తాంతములు 22:11 అయితే రాజునకు కుమార్తెయైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలోనుండి దొంగిలించి, అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండ అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను; ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి.

యెహెజ్కేలు 44:8 నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.

యెహెజ్కేలు 44:11 అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు.

యెహెజ్కేలు 45:4 యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు